calender_icon.png 10 January, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెల్లాపూర్’ను రోల్ మోడల్ చేయాలి

04-08-2024 02:22:54 AM

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

పటాన్‌చెరు, ఆగస్టు 3: తెల్లాపూర్ మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపాలిటీ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, కుంటలు అన్యా క్రాంతం కాకుండా చూడాలన్నారు. 30 పడకల ఆస్పత్రి పనులు చేపట్టి సత్వరం పూర్తి చేయాలన్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంత మవుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కబ్జాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తనకు నివేదిక ఇవ్వాలని ఆదే శించారు. చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల వద్ద ఫెన్సింగ్ వేయాలన్నారు. 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 2015లో ప్రారంభమైన రేడియల్ రోడ్డు పనులు ఇప్పటికీ కొనసాగుతుండడంపై విస్మయం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మున్సిపల్ అధికారులు ఉన్నారు.