మంత్రి పొంగులేటి స్పష్టం
బీఆర్ఎస్లో అల్ప సంతోషులు: తెల్లం వెంకట్రావ్
హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి) : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్‌లోనే ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. పాత పరిచయాలతో బీఆర్ఎస్ నేతలను కలిసి ఉంటారని తెలిపారు. కేటీఆర్‌తో వెంకట్రావ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే వెంకట్రావ్ స్పందిస్తూ.. బీఆర్ఎస్లో కొంద రు అల్ప సంతోషులు ఉన్నారని , తన ఫొటో తీసి పార్టీ మారుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల చాంబర్ల వద్దకు వచ్చి కలుస్తున్నారని, వారంతా పార్టీ మారేవారేనా? అని నిలదీశారు. కాంగ్రెస్‌తోనే తన ప్రయాణమని స్పష్టంచేశారు.
కాంగ్రెస్‌లోనే ఉంటా: కాలె యాదయ్య
తాను కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.