దళిత నాయకులతో బీఆర్‌ఎస్ విమర్శలు చేయిస్తోంది
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిపై అను చిత వ్యాఖ్యలు చేస్తే.. పదవిని పక్క న పెట్టి మీ అంతు చూస్తానని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సుమన్, కిశోర్‌లకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యా ప్తంగా 33 జిల్లాలలో కేసులు పెట్టిస్తామన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు ఆ పార్టీలోని దళిత నాయకులను ముం దుపెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీని, గ్రూ ప్ పరీక్షలను వాయిదా వేయాలంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేస్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం వాటిని భర్తీ చేస్తుంటే ఓర్వలేకే ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు బీఆర్‌ఎస్ నాయకుల వలలో పడొద్దని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారని తెలిపారు. తార్నాకలోని ఆరాధన థియే టర్లలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే కిషోర్.. సీఎంపై విమర్శలు చేయడం సరికాదని చారుకొండ వెంకటేశ్ హెచ్చరించారు.