- ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డికి చెప్తరు..
- సీఎం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు పెడ్తరు..
- పాడి రైతులతో పశువైద్యాధికారుల దురుసు సమాధానం
- మహబూబ్‌నగర్‌లో వెలుగు చూసిన ఘటన
మహబూబ్‌నగర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ‘జీవాల ఆరోగ్యం గురించి మీరు ఎమ్మెల్యేకు చెప్పండి. ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డికి చెప్తడు. సీఎం ప్రత్యేకంగా బడ్జెట్ పె ట్టి మీ పశువులకు సరిపడా మందులు పంపిస్తడు. అప్పుడు మేం స్పందిస్తాం..’ అంటూ హన్వాడ పశువైద్యాధికారులు పాడి రైతుల కు దురుసుగా సమాధానమిచ్చారు. జీవాల కు చికిత్స అందించి, మెడిసిన్ ఇవ్వాలని కో రడమే పాడి రైతులు చేసిన తప్పు. ఈ చే దు అనుభవం శనివారం షేక్‌పల్లి రైతులకు ఎ దురైంది. గ్రామానికి చెందిన మహేష్ అనే పాడిరైతు 1962 టోల్‌ఫ్రీం నంబర్‌కు కాల్ చేశాడు. తాను పెంచుతున్న గేదె ఆరోగ్యం క్షీ ణించిందని తక్షణం వైద్యసేవలు అందించాలని కోరాడు.
పశువైద్యాధికారులు గ్రామాని కి చేరుకుని గేదెకు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం పాడి రైతు మెడిసిన్ కోరగా తమ వద్ద మందులు లేవని, కావాలంటే చిట్టీ రాసి ఇస్తామని, మెడిసిన్ బయటకు వెళ్లి ఎక్కడైన తెచ్చుకోవాలని సూచించారు. అందుకు పాడి రైతు స్పందిస్తూ.. మేం పేదవాళ్లమని, అంత డబ్బు పెట్టి మెడిసిన్ కొనలేమని సమాధానమిచ్చాడు. దీంతో పశువైద్యాధికారి మెడిసిన్ తమకు అందలేదని, సర్కార్ నుంచి మెడిసిన్ ఇస్తామంటే సరిపోయేది.
కానీ సదరు అధికారి అనవసరంగా నోరుపారేసుకున్నాడు. ‘మెడిసిన్ లేవని ఎమ్మెల్యేకు చెప్పండి.. ఎమ్మెల్యే ద్వారా సీఎంకు విషయం తెలుస్తుంది. నిధులు వస్తాయి. మెడిసిన్ వస్తాయి’ అని కోపంతో ఊగిపోయాడు. ఈ విషయంపై పశువైద్యాధికారితో పాటు సిబ్బందిని వివరణ కోరగా ‘ మా వద్ద మెడిసిన్ లేదు. లేనప్పుడు మేం ఇవ్వలేం’ అంటూ సమాధానాన్ని దాట వేశారు.
డ్యూటీ చేస్తుండ్రు అంటే చేస్తుండ్రు అంతే..
పశువైద్యాధికారులు డ్యూటీ చేస్తుండ్రు అంటే చేస్తుండ్రు. జీవాలకు ఆరోగ్యం బాగాలేదంటే ఎమ్మెల్యేకు చెప్పండి అంటుడ్రు. అధికారులు జర్ర రైతులకు మేలు చేసేలా ఉండాలి గానీ.. గిట్ల మాట్లాడకూడదు. మందులు ఎక్కడో తెచ్చుకోండి అంటే మరి వారు ఉన్నది ఎందుకు?
కేశవులు, పాడి రైతు,
షేక్‌పల్లి గ్రామం
గేదెకు బాగలేకపోతే ఎమ్మెల్యేకు చెప్పాలా ?
గేదెకు బాగలేకపోతే ఎమ్మెల్యేకు మా సమస్య చెప్పాలా ? ఇదేం పద్ధతో మాకు అర్థం కావడం లేదు. సంచార వాహనం పశువులకు వైద్య సేవలు అందించేందుకే సర్కార్ ఏర్పాటు చేసింది. గేదెకు బాగా లేదని మెడిసిన్ ఇవ్వాలని అడిగితే తప్పా?
గోపాల్, పాడి రైతు, షేక్‌పలి