calender_icon.png 4 January, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ సమస్య ఉన్న టీచర్లకు చెప్పండి

01-01-2025 05:50:44 PM

నిర్మల్ (విజయక్రాంతి): కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తనను గాని టీచర్లను గాని సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని పెంబి లక్ష్మణ్ చందా దస్తురాబాద్ కానాపూర్ తదితర కేజీబీవీ పాఠశాలను సందర్శించి విధుల్లో ఉన్న టీచర్లకు సూచనలు చేశారు. టీచర్ల సమ్మె కారణంగా విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాఠాలు బోధించడం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.