calender_icon.png 23 December, 2024 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు నిజాలు చెప్పండి!

27-08-2024 12:00:00 AM

ఆదివారం విజయక్రాంతిలో పత్రిక చైర్మన్ సీఎల్ రాజం ‘దాగుడు మూతలెందుకు?’ శీర్షికన ప్రచురించిన ప్రత్యేక సంపాదకీయం ప్రభుత్వానికి, పాలక పక్షానికి ఆరోగ్యదాయకమేకాక ప్రజోపయోగమైంది కూడా. ప్రభుత్వాలు తమ ఆర్థిక స్థితిగతులు, పథకాల అమలుకు సంబంధించిన వాస్తవాలను ఎప్పటి కప్పుడు ప్రజలకు తెలియజేయడం ఎంతైనా అవసరం. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సదవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వాలకు ప్రజలవద్ద పని కట్టుకొని దాచవలసినవి ఏముంటాయి? నిజాలు చెప్పకుండా దాయడం వల్ల పారదర్శకత లోపిస్తున్నట్టుగా అనవసర సంకేతాలు ప్రజలకు వెళతాయి. ఇది అవసరమా? పాలక పక్షం వారు ఆలోచించాల్సిన విషయమిది. 

 డీఎస్ కుమార్, బెంగళూర్