సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజయ్ దేవరకొండ సూచించాడు. ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఫేక్ కాల్స్, మెసేజ్‌లపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వీడియోను విడుదల చేశాడీ రౌడీ హీరో. తన స్నేహితుడి విషయంలో జరిగిన ఓ ఘటనను ఉదహరిస్తూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారాయన. “ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే..
‘నేను మూర్ఖుడిని’ కాదు అని చెప్పండి” అని విజయ్ పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో మా స్నేహితుడికి పంపబోయి పొరపాటున డబ్బు మీ అకౌంట్‌లో పడిందనో.. లేదంటే మరో రకంగానో సైబర్ నేరగాళ్లు అకౌంట్‌లోని డబ్బంతా కాజేస్తున్నారు.
అలాంటి మెసేజ్‌లు ఏమైనా వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలని విజయ్ దేవరకొండ తెలిపాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో, రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలోనూ ఓ చిత్రాన్ని విజయ్ దేవరకొండ ఖరారు చేశాడు.