calender_icon.png 6 January, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణ పరిధి చెప్పండి

04-01-2025 02:07:59 AM

ఏపీటీడీసీ పిటిషన్‌పై వాణిజ్య వివాదాల కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఆస్తుల వివరాలు సమర్పించేలా ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)కి ఆదేశాలు ఇవ్వడం సబబుకాదని హైకోర్టు పేర్కొన్నది. బకాయిలు చెల్లించకపోవడంపై కేసీసీ ప్రాజెక్ట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిధి ముందుగా తేల్చాలని వాణిజ్య వివాదాల కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీటీడీసీ పర్యాటక శాఖ భవనాల నిర్మాణాల కోసం 2013 ఏప్రిల్‌లో కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నది. ఏపీటీడీసీకి కేపీసీ సంస్థకు మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వివాదం ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వద్ద కు చేరింది. దీనిపై ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ రూ.317 కోట్లను వడ్డీతో సహా కేసీసీ సంస్థకు చెల్లించాలని 2022లో ఏపీటీడీసీని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ తీర్పును ఏపీటీడీసీ మళ్లీ సవాల్ చేయలేదు. మరోవైపు తీర్పు అమలు చేయాలంటూ కేపీసీ సంస్థ వాణిజ్య వివాదాల కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన వాణిజ్య వివాదాల కోర్టు ఏపీటీడీసీకి చెందిన ఆస్తుల వివరాలను సమ ర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీటీడీసీ లేవనెత్తిన అభ్యంతరాలను కింది కోర్టు పట్టించుకోకపోవడంతో ఏపీటీడీసీ కొంతకాలం క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీటీడీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏపీటీడీసీకి చెందిన ఆస్తులన్నీ ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, వాటి వివరాలను సమర్పించాలని ఆదేశించే పరిధి హైదరాబాద్‌లోని వాణిజ్య వివాదాల కోర్టుకు లేదన్నారు.

ఇదే అభ్యంతరాన్ని తాము గతంలోనూ వ్యక్తం చేశామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం మూడు వారాల్లో వాణిజ్య వివాదాల కోర్టుకు ఆస్తుల జాబితా సమర్పిం చాలని ఏపీటీడీసీని ఆదేశించింది. అంతకుముందే కేసీసీ ప్రాజెక్ట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిధి తేల్చాల్సిస ఉందని, తర్వాత ఆర్బిట్రేషన్ అవార్డు అమలుపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని వాణిజ్య వివాదాల కోర్టును ఆదేశించింది.