calender_icon.png 25 April, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు ఉంటే చెప్పండి

25-04-2025 02:42:57 AM

ఆర్మీ క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : సమస్యలుంటే చెప్పాలని ప్రతి సమస్యను పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణం లోని బండమీద పల్లి లో ఉన్న  ఆర్మీ క్యాంటీన్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  సందర్శించారు.  ఈసందర్భంగా క్యాంటీన్ నిర్వహణకు వసతి  సరిపోవడం లేదని, పార్కింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఉన్న క్యాంటీన్ ప్రదేశం స్థలభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని,  స్టోరేజీ కోసం  మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 

ఎన్ సి సి కార్యాలయం దగ్గర ఖాళీ గా ఉన్న ఆగ్రో సర్వీస్ సెంటర్ ను తమకు కేటాయించాలని వారు ఎమ్మెల్యే ని కోరగా, ఆయన వెంటనే స్పందించి ఆగ్రో సర్వీస్ సెంటర్ ను ఆర్మీ క్యాంటీన్ సభ్యులతో కలిసి పరిశీలించారు.   అనంతరం 8 తెలంగాణ బెటాలియన్ ఎన్ సి సి( 8(T) BN NCC ) కార్యాలయాnni సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డితో మాట్లాడి  ఎన్ సి సి కార్యాలయంలో టాయిలెట్ రూమ్ లను నిర్మించాలని కమీషనర్ ని  ఆదేశించారు. ఎంవిఎస్ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల లో ఎన్ సి సి క్యాంపు ఎందుకు నిర్వహించడం లేదని కమాండింగ్ ఆఫీసర్ ను ప్రశ్నించారు.  అక్కడ టాయిలెట్లు లేవని అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని  అధికారులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో గూండా మనోహర్, ఎం ఆర్ కె రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.