calender_icon.png 8 January, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలుంటే చెప్పండి

04-07-2024 02:22:58 AM

రైతుబజార్‌ను సందర్శించన ఎమ్మెల్యే సబితారెడ్డి

మహేశ్వరం, జూలై 3 (విజయక్రాంతి): రైతుబజార్‌లో కూరగాయల క్రయవిక్రయా ల్లో ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం సరూర్‌నగర్ రైతు బజార్‌ను ఆమె సందర్శించారు. కూరగాయలు విక్రయించే క్రమంలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని రైతుల ను, ధరలు ఎలా ఉన్నాయి అని కొనుగోలుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేఆర్ భవన్‌లో మరమ్మతులను త్వరలో పూర్తిచేస్తామని అన్నారు. ఆమె వెంట పలువురు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సబితకు సన్మానం..

మెకానిక్స్ డే సందర్భంగా వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సబితారెడ్డి పాలొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సబితారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కామేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.