calender_icon.png 20 January, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షయ్‌ని విషపు గడ్డి తినుమని చెప్పా..

12-08-2024 12:00:00 AM

‘ఇంటర్నేషనల్ ఖిలాడీ’ (1996) సినిమాలో తొలిసారి కలిసి నటించారు అక్షయ్‌కుమార్, ట్వింఖిల్ ఖన్నా. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించగా, పెద్దలను ఒప్పించి 2001లో దంపతులుగా మారారు. అక్షయ్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇక, ట్వింఖిల్ రచయిత్రిగా రాణిస్తున్నారు. నిరుడు అత్యధికంగా అమ్ముడైన నవలల్లో ట్వింఖిల్ రాసిన ‘వెల్‌కమ్ టు ప్యారడైజ్’ నవల ఒకటి. ఎంతో సరదాగా ఉండే ఈ జంట ఇటీవల టూర్‌కు వెళ్లారట. ఆ సందర్భంలో జరిగిన ఓ సరదా సంఘటనను తన బ్లాగ్ ద్వారా పంచుకుంది ట్వింఖిల్.

తన భర్త సరదాగా ఉంటారని చెప్తూ ఆ సరదా సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చిందామె.. “విహార యాత్రలో భాగంగా కొన్ని రోజుల క్రితం మేము ఒక ప్రాంతానికి వెళ్లాం. అక్కడ ఒక ప్రదేశంలో సేద తీరుతున్న ప్పుడు.. అక్కడికి వచ్చిన రెండు పక్షులను చూపించి వాటి గురించి గైడ్ వివరించాడు. వాటిని టిక్ టిక్ పక్షులంటారని.. నిజమైన ప్రేమకు అవి చిహ్నమని తెలిపాడు. ఏదైనా కారణంగా పార్ట్‌నర్ చనిపోతే.. మరో పక్షి ఒంటరిగా ఉండలేక విషపూరితమైన గడ్డి తిని ప్రాణాలు విడుస్తుందని చెప్పాడు.

ఆ మాటలు విని నా గుండె బరువెక్కింది. అక్షయ్‌తో ఇలా అన్నా.. ‘అక్షయ్, ఒకవేళ నేను చనిపోతే నువ్వూ ఇలాగే విషపు గడ్డి తిను. అలా కాదని, నువ్వు గనక మరో పెళ్లి చేసుకుంటే.. నేను తప్పకుండా మీ ఇద్దరినీ వెంటాడి ఇబ్బంది పెడతా’ అని చెప్పా. ఆ మాటలకు ఆయన షాకవడమే కాక ‘అప్పటిదాకా ఎందుకు? ఆ గడ్డేదో ఇప్పుడే తినేస్తా.. ఎందుకంటే ఇలాంటి నీ పిచ్చి మాటలు వినడం తప్పుతుందిక’ అన్నాడు. దాంతో మేమిద్దరం నవ్వుకున్నాం. అని రాసుకొచ్చించి ట్వింఖిల్ ఖన్నా.