27-04-2025 12:00:00 AM
డీఎంహెచ్‌ఓ డాక్టర్ సీ ఉమా గౌరీ
మేడ్చల్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు టెలి మానస్ సేవ ఉపయోగపడు తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సి ఉమా గౌరీ తెలిపారు. పరీక్షల ఫలితాల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఫలితాలు వచ్చిన వెంటనే టెలి మానస్‌ను సంప్రదిస్తే వారిలో ఆత్మస్థైర్యం, భరోసా కల్పి స్తుందన్నారు. మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారు 14416, లేదా 1800-89 1-4416 నెంబ ర్‌కు కాల్ చేయాలని ఆమె తెలిపారు.
టెలిమానస్ కేవలం హెల్ప్ లైన్ మాత్ర మే కాదని, ఇది ఒక స్నేహపూర్వక మద్ద తు వ్యవస్థ అని పేర్కొన్నారు. హెల్ప్ లైన్ కు కాల్ చేస్తే వారి భాషలోనే ముచ్చటించబడుతుందని, శిక్షణ పొం దిన మానసిక ఆరోగ్య నిపుణులతో వారికి కనెక్ట్ చేస్తారని తెలిపారు. సై కాలజిస్ట్‌లు, మానసిక సామాజిక కార్యకర్త లు, నర్సులు సమస్యలను వినడమే గా క మానసిక చికిత్సను అందిస్తారన్నారు.