calender_icon.png 30 October, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంఘీజ్‌ఖాన్‌తో టెలిగ్రామ్ సీఈవో పోటీ

01-08-2024 08:30:00 AM

100 మంది పిల్లల ప్రకటనపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సరదా పోస్ట్

న్యూఢిల్లీ, జూలై 31: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తనకు పెళ్లికాకుండానే ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్‌గా తండ్రినయ్యాయని వెల్లడించిన విషయం తెలిసిందే. వీర్యాన్ని దానం చేసి 100 మందికి పైగా జంటలకు సంతానాన్ని అందించానని దురోవ్ తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా తాజాగా వెల్లడించాడు. కాగా, దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. 1000 మందికి పైగా పిల్లలు ఉన్న ఓ మనిషితో దురోవ్ పోటీపడుతున్నారని పోస్ట్ చేశారు. కచ్చితమైన సంఖ్య తెలియదు కానీ మంగోలియన్ యోధుడు చెంఘీజ్‌ఖాన్‌కు చాలామంది పిల్లలు ఉన్నారని, ఆయన సరసన చేరేందుకు దురోవ్ కృషి చేస్తున్నారని సరదాగా పోస్ట్ చేశారు.