calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు..

10-04-2025 12:08:24 AM

ప్రభుత్వానికి సోయి లేదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పిన మాటలే నిజం అవుతున్నాయని, తెలంగాణ నీళ్లపై హక్కులు కోల్పోతున్నామని అన్నారు.

చంద్రబాబు చేతిలోకి నాగార్జనసాగర్ వెళ్లిందని, బాబు అంటే రేవంత్‌రెడ్డి సర్కార్‌కు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సాగర్‌లోకి విశాఖ సీఆ ర్‌పీఎఫ్ బెటాలియన్ రావడం విచాకరమని, సాగర్‌ను తెలంగాణ నుంచి ఆంధ్రాకు అప్పగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం, మంత్రులు దోచుకుందాం దాచుకుందాం చందంగా మారారని విమర్శించారు. తెలంగాణలో పరోక్షంగా బాబు పాలనే నడుస్తోం దని ఆరోపించారు. సాగర్‌పై 2023కి ముందున్న స్థితిని కొనసాగించాలన్నారు.