calender_icon.png 23 November, 2024 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా దయతోనే తెలంగాణ ఏర్పాటు

23-11-2024 04:18:40 AM

నాలుగేండ్లలో రాష్ట్రం మరింత పురోగతి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండలో ప్రజాపాలన  విజయోత్సవ సభ

నల్లగొండ, నవంబర్ 22 (విజయక్రాంతి): సోనియా గాంధీ దయతోనే తెలం గాణ రాష్ట్రం ఏర్పడిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నా రు. ఎవరో చావు నోట్లో తలపెడితే తెలంగాణ రాలేదని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. శుక్రవారం రాత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి హాజరై మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోతుం దని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ఏర్పాటుకు సోనియా ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. శ్రీకాంతారెడ్డి ఆత్మబలిదానం చేసుకోవడం తనను కలిచివేసే నాడు మంత్రి పదవికి తాను రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. అధికారం కోల్పోయి అసహనంతో బీఆర్‌ఎస్ పార్టీ దాడులకు ప్రేరేపిస్తున్నదని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. రాష్ట్ర ఖజానా అంతంత మాత్రంగానే ఉన్నా ప్రజలకిచ్చిన హామీ మేరకు ఆరుగ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న నాలుగేండ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రపథాన నిలుపుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎస్సెల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలను పూర్తి చేసి నల్లగొండ, యాదాద్రి జిల్లాలను సస్యశ్యామలం గా మారుస్తామన్నారు.

అనంతరం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్‌గౌడ్,  సంగీత అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.