calender_icon.png 25 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ఏర్పాటు

25-11-2024 01:40:21 AM

  1. పక్కా రియల్టర్‌లా సీఎం రేవంత్ తీరు
  2. బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ 

నల్లగొండ, నవంబర్ 24 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పక్కా రియల్టర్‌లా వ్యవహరిస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతిస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ తీరుతో హైదరాబాద్‌లో భూములు క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయన్నారు. లగచర్లలో గిరిజన రైతులపై సర్కారు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వం ప్రజలకు రిక్తహస్తం చూపుతున్నదన్నారు.

మంగళవారం జిల్లా పార్టీ ఆఫీస్‌లో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు దేవేందర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.