20-04-2025 12:27:46 AM
టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ.కోదండరాం
ముషీరాబాద్, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి) : ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల కార్యాచరణ సమావేశం రామగిరి ప్రకాష్, గొల్లపల్లి నాగరాజుల అధ్యక్షతన జరిగింది. పివొడబ్లు జాతీయ అధ్యక్షురాలు సంధ్యతో కలసి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం న్యాయమేనన్నారు. సమన్వయ కమిటీ పెట్టిన డిమాండ్లు న్యాయమైనవేనని అన్నారు.
ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని స్వరాష్ట్ర సాధనకు కారణ మైన ఉద్యమకారుల న్యాయమైన కోరికలను పరిష్కరించాల్సిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఒక్కరితో తెలంగాణ రాలేదని, ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని అన్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో తెలం గాణ వెంకన్న, ముత్తయ్య యాదవ్, బండి వెంకటేష్, లాలయ్య, బీరకాయల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన గొల్లపల్లి నాగరాజు మాట్లాడుతూ ఒకవేళ జూన్ 2వ తేదీ లోపు కమిటీ ప్రకటించకుండా ఉంటే బిక్షటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటామన్నారు.