calender_icon.png 20 January, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో విద్యుత్ స్తంభింప చేస్తాం

20-01-2025 03:50:29 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలో విద్యుత్ రంగంలో జెనకో, ట్రాన్సకోలో పనిచేస్తున్న 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులను కనవర్శన్ చెయ్యాలని కోరుతూ రాష్ట్రంలో జనవరి 20 నుండి 25 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పాల్వంచ కేటీపీస్ గెట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలను విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సంఘ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎండీ వజీర్ కార్మికులకు పూల దండలు వేసి ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా వందలాది మంది కార్మికులు హాజరయ్యారు. సభలో నరాటి ప్రసాద్, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎండీ వజీర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగలో పనిచేస్తున్న 20 వేల మంది కార్మికులను కనవర్శన్ చేయకుండా ఆర్టిజన్ అని ముద్దు పేరుతో అన్యాయం చేశారని విమర్శించారు.

ఆర్టిజన్ అని జిఓ వలన కార్మికుల ఉనికి ప్రశ్నర్ధకం లో ఉన్నది అని జీవితం మొత్తం రెగ్యులర్ కాకుండా వెట్టి చాకిరి చేస్తూ సమిధులు కావాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు, చట్ట ప్రకారం 5ఏళ్ళు పూర్తి సర్వీస్ చేసిన కార్మికులను ఇంక్రిమెంట్, గ్రేడ్ ప్రమోషన్, ఇవ్వాలని కానీ 10 ఏళ్ళు దాటినా పదోన్నతి లేదు అని కార్మికుల చే వెట్టి చాకిరీ, శ్రమ దోపిడీ ని ప్రభుత్వం చట్ట బద్దం చేశారు అని అన్నారు. తక్షణం అందరికి కనవర్శన్ చెయ్యాలని కేసీఆర్ చేసిన మోసం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కనవర్శన్ చేయాలని, లేనిచో తెలంగాణ మొత్తం విద్యుత్ సరఫరా స్తంభింప చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.