27-02-2025 12:43:20 PM
కన్వెయర్ బెల్ట్ కు మరమ్మత్తు పనులు.
టిబిఎమ్ మిషన్ షకలాలను తొలగించేందుకు గ్యాస్ కట్టర్ల వినియోగం.
సహాయక చర్యలను వేగం పెంచిన రెస్క్యూటిమ్ ఉన్నతస్థాయి నిపుణులు.
నాగర్‌కర్నూల్, (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ(SLBC Tunnel Collapse Rescue) సొరంగ మార్గం కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు గల్లంతయిన ఘటంలో దేశ విదేశాల్లోని 11 రకాల రెస్క్యూటిమ్ బృందాలన్నీ కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సుమారు ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్న నేపథ్యంలో ప్రమాదం జరిగిన గంట నుంచి ఐదు రోజులపాటు ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటికి తెచ్చేందుకు 11 రకాల రెస్క్యూ టీమ్ బృందాలన్నీ శత విధాల యత్నించాయి. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీం తో పాటు ఝార్ఖండ్ మైనింగ్ టీం, ఎల్ అండ్ టి, ఐఐటి మద్రాస్ టీం, ర్యాట్ హోల్ మైన్స్ రెస్క్యూ టీమ్ సైతం మొత్తంగా 600 మందికి పైగా సహాయక బృందాలు ఈ రిస్క్యూటిమ్ లో ప్రత్యేక టీమ్ గా ఫామ్ అయి ప్రతి ఆరు గంటలకు ఒకసారి టర్నల్ లోని ప్రమాద ఘటన స్థలికి వెళ్లి పరిశీలించి తిరిగి మంత్రులతో అధికారులతో పరిస్థితిని వివరించి దిశా నిర్దేశం సమాలోచనలు చేసుకుని చివరగా గురువారం సహాయక చర్యలను వేగిరం చేశారు.
నీటి ఊట అదుపులోకి రాకపోవడంతో నీటి ఊటను అదిగమించేలా డీ వాటరింగ్ కోసం భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. బురదను బయటికి తరలించేందుకు కాన్వేయర్ బెల్ట్ పని చేయక పోవడంతో ప్రత్యామ్నాయ మార్గం లోకో ట్రైన్ ద్వారా బురదను తోడివేస్తున్నారు. టార్నెల్ లో బురద మట్టి మరింత కూలే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రక్షణ గోడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్మికుల జాడను కనిపెట్టేందుకు అడ్డుగా ఉన్న టర్నల్ బోరింగ్ మిషన్ (టిబిఎంమ) షకలాలను తొలగించేందుకు భారీ స్థాయిలో గ్యాస్ కట్టర్లు వినియోగిస్తున్నట్లు రెస్క్యూ టీం సభ్యులు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుండి సొరంగంలోని 12వ కిలోమీటర్ వద్ద నుంచి బురద తోడివేత పనులను ముమ్మరం చేశారు. ర్యాట్ హోల్ మైన్స్, ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం సభ్యులంతా ఇతర మార్గాల గుండా టిబిఎం మిషన్ వరకు చేరుకొని శకలాలను తొలగించే పనులు మరింత ముమ్మరం చేశారు.