అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ట్రాన్స్‌కోను జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ వరించింది. ఈ అవార్డును గ్రిడ్ ఇండియా, ఫోమర్ ఆఫ్ లోడ్ డిస్పాచర్స్ ఆధ్వర్యంలో ప్రతిఏటా అందజేస్తారు.
ఈసారి ఇది ట్రాన్స్‌కోకు దక్కింది. ఈ అవార్డును సాధించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్రాన్స్‌కో అధికారులను అభినందిచారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలకు ఇదొక సమున్నత గౌరవమని ప్రశంసించారు. ట్రాన్స్‌కో టీమ్‌ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో కో సీఎండీ కృష్ణ భాస్కర్ అభినందించారు.