21-02-2025 12:41:58 AM
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల నమోదులో 1,0150 సభ్యత్వాలతో తెలంలగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. దీందో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో గురువారం గాంధీభవన్‌లో పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కార్యకర్తలకు ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు నీలం పద్మ, ఆర్ వరలక్ష్మి, అనురాధ, ఇందిరా, లక్ష్మిపార్వతమ్మ, శంభుల ఉషశ్రీ , సరళ, కవిత తదితరులు పాల్గొన్నారు.