హైదరాబాద్(విజయక్రాంతి): తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Telangana Teacher Eligibility Test)లకు సంబంధించిన హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonine.in/tstet/ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జనవరి 2 నుంచి ప్రారంభమై జనవరి 20న ముగుస్తాయి. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించబడతాయని, ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలు విడుదలవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది టెట్ పరీక్ష కోసం మొత్తం 2,48,172 మంది అప్లికేషన్ చేసుకోగా, టెట్ పేపర్-1కు 71,655, పేపర్-2కు 1,55,971 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే +91 70750 28882/85 నెంబర్లను సంప్రదించవచ్చు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.