30-04-2025 03:16:52 PM
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు(Telangana SSC Public Examination results 2025) బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిహించనున్నారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన పరీక్షలకు 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు సహా మొత్తం 5,09,403 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విద్యార్థులు ఫలితాలను కింద ఇచ్చిన వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.
https:// results.bsetelangana.org/