09-03-2025 12:36:17 AM
187 రకాల టీలతో అదరహో అనిపించిన అతివలు
రూ.లక్షలు గెలుచుకున్న విజేతలు
వీడియో సందేశాన్ని పంపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో తెలంగాణ టీ ఛాంపియన్ షిప్ కార్యక్రమం నిర్వహించారు. భాగ్యనగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు పాల్గొ ఈవెంట్‌ను విజయవంతం చేశారు. సవ్యసాచి ఘోష్ (స్పెషల్ చీఫ్ సెక్రెటరీ -పశు శాఖ), శశికుమార్ (ఫౌండర్, సీఈవో అక్షయకల్ప ఆర్గానిక్), కిరణ్ కుల్‌కర్ణి (హెడ్ బీటీఎల్ మార్కెటింగ్ అక్షయకల్ప ఆర్గానిక్), కరుణా గోపాల్ (ప్రెసిడెంట్ - ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్), సయ్యద్ ఇర్ఫాన్ (సుభాన్ బేకరీ ఎండీ), జాకి పటేల్, జాకిర్ పటేల్ (డైరెక్టర్స్ ఏ1 టీ కంపెనీ), శేఖర్ పుట్ట (తెనాలి డబుల్ హార్స్ సీఓఓ), ఎం.రాజ్‌గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ హై బిజ్ టీవీ తెలు నౌ), డాక్టర్ జె.సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ హై బిజ్ టీవీ ఎల్‌ఎల్‌పి) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హై బిజ్ టీవీ తెలం టీ ఛాంపియన్ షిప్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వీడియో సందేశాన్ని పంపారు. దేశంలోనే హైదరాబాద్ నగరం టీకి చాలా ప్రాధాన్యమిస్తోందన్నారు. తెలంగాణ టీ ఛాంపియన్ షిప్ నకు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సహకారాన్ని అందించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఇక, ఈ పోటీకి మొత్తం 187 మంది మహిళలు హాజరై రకరకాల ఛాయ్ పెట్టారు. అల్లం, బెల్లం, శొంఠి, వనమూలికలు, లెమన్ గ్రాస్, చెరకు, ఇప్ప పువ్వు, తేనే, రోజ్, వేపాకు, ధనియాలు, మలాయ్.. ఇలా పలు విధాలుగా వాటిని తయారు చేశారు. మొత్తం 14 రౌండ్లలో తె టీ ఛాంపియన్ షిప్ జరిగింది. కాంపిటీషన్ లో పాల్గొన్న మహిళలు పెట్టిన ఛాయ్ ని 15 మంది జడ్జీలు రుచి చూసి పాయింట్లు కేటాయించారు.
వాటి ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి విజేత మాధవికి రూ.లక్ష, సెకండ్ ప్రైజ్ విజేత సంగానికి రూ.50 వేలు, మూడో బహుమతి విన్నర్ టి జ్యోతికి రూ. వేలు అందించారు. అలాగే ఐదుగురు విన్నర్స్‌కు తలా రూ.5 వేల క్యాష్ ప్రైజ్ దక్కింది. వీరితో పాటు లక్కీ డ్రా తీసి మరో 25 మందికి ప్రైజెస్ ఇచ్చారు. ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించిన హై బిజ్ టీవీని సవ్యసాచి ఘోష్ ప్రశంసించారు. అటు, లండన్ లో బీర్ ఫెస్టివల్ ఎంతో ఫేమస్ అని.. దాన్ని టీ ఛాంపియన్ షిప్ గుర్తు చేసిందని కరుణా గోపాల్ చెప్పారు. పోటీలో ప్రథమ స్థానం లో నిలవడం ఆనందంగా ఉందని, తాను గెలుచుకున్న లక్ష రూపాయలను పేదలకు విరాళంగా ఇస్తానని మాధవి ప్రకటించారు.