calender_icon.png 26 December, 2024 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకుపచ్చ చీరలో 'తెలంగాణ తల్లి'

06-12-2024 04:52:36 PM

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీరలో రూపొందించారుకాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఉండేలా ఛత్తీస్ ఘడ్ మహతారీ పోలికలతో నూతన తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తెలిపారు.