07-03-2025 12:53:16 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్ర మల ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రదేశమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఎన్‌ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ కంపెనీ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతల గురించి వారికి వివరించారు. సెమీ కండక్టర్స్ తయారీకి సంబంధించిన ఆర్‌అండ్‌డీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు ఎన్‌ఎక్స్‌పీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని స్టార్టప్‌లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయాలని కోరారు.
2030 నాటికి దేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ సిటీలో భాగస్వా మ్యం కావాలని వారిని కోరారు. తెలంగాణలో ఉన్న ప్రతిభావంతమైన మాన వ వనరులను వినియోగించుకోవాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ లో భాగస్వామ్యమై, సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారుచేయాలన్నారు.