కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డా.బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై కరీంనగర్ మున్సిపల్ మేయర్ యాదగిరి సునీల్ రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... ప్రతి క్రీడాకారుడు కూడా ఒక లక్షయాన్ని ఎన్నుకొని లక్ష్యసాధన కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. హ్యాండ్ బాల్ క్రీడా ప్రపంచంలోనే చాలా వేగవంతమైన క్రీడా, ఈ క్రీడను అందరూ ఆదరించాలని హ్యాండ్ బాల్ క్రీడా ఒలంపిక్ క్రీడ, కావున హ్యాండ్ బాల్ క్రీడ అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, మరియు జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందలి మహిపాల్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తెలంగాణ ప్రాధికార సంస్థ అబ్జర్వర్ దీపక్ ప్రసాద్, జుంజుపల్లి వివేక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్, నెమలికొండ ప్రభాకర్, కోచ్ మూల వెంకటేష్, ట్రెజరర్ కనకయ్య, రెఫ్రిజ్ బోర్డు కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, వివిధ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కనపర్తి రమేష్, చింతకాయల పుల్లయ్య, పాప్లవట్ శంకర్ నాయక్, సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారులు, మల్లేష్, శ్రీనివాస్, రాజశేఖర్, జయంత్, అమర్, శివాజీ, సాయి పాల్గొన్నారు. అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వీర్ల వెంకటేశ్వర్ రావు, ప్రధాని కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్ తెలిపారు.