బెల్లంపల్లి (విజయక్రాంతి): జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా శనివారం తాండూర్ మండలానికి చెందిన తెలంగాణ నిరుద్యోగ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తాండూర్ పోలీస్ స్టేషన్లో చిలుపుల శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కి నిరుద్యోగుల సమస్యలను తెలిపేందుకు వెళ్లకుండా పోలీసులు తనను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని అదే రీతిగా ఈ ప్రభుత్వం కూడా వివరించడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేనట్లయితే తెలంగాణ నిరుద్యోగ ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన నుంచి పట్టినందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.