calender_icon.png 29 November, 2024 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది..

29-11-2024 07:07:11 PM

ఉద్యమాలకు గడ్డ కామారెడ్డి

కేసీఆర్ సచ్చుడో  తెలంగాణ వచ్చుడో నినాదంతో ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్

కేసీఆర్ పేరు లేకుండా చెరిపేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడం అవివేకం తనం

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంత మట్టి అను వణువులో  కేసీఆర్

70 దేశాల కన్నా తెలంగాణ అభివృద్ధి చెందింది కేసీఆర్ తోనే సాధ్యం

తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీకి  ద్రోహం చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారికి గుణపాఠం తప్పదు

గ్రామ గ్రామాన ఇంటింటికి కార్యకర్తలు కేసీఆర్ చేసిన త్యాగాలను వివరించాలి

కామారెడ్డి (విజయక్రాంతి): కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన చేసిన పోరాటాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కామారెడ్డి జిల్లా దీక్ష దివాస్ కార్యక్రమా ఇన్చార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేసిన పోరాటంతోనే తెలంగాణ రావడం జరిగిందని విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బిజెపి నేతలు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే పదవులు వచ్చాయి అనే విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేకతనానికి నిదర్శనం అన్నారు. కేసీఆర్ అనువాళ్ళు ప్రతి ప్రాంతంలో తెలంగాణ మట్టిలో ఉన్నాయని అన్నారు.

కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేపట్టడంతోనే  కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు దిగి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారే తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ తిరుగులేని పోరాటం చేస్తుందని అన్నారు. కేటీఆర్ ప్రశ్నించిన అందుకే ఆదాని నుంచి తీసుకున్న 100 కోట్ల విరాళం తిరిగి ఇచ్చేశారని పేర్కొన్నారు విద్యార్థులకు సరైన భోజనం అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. గురుకులాలను కేటీఆర్ సందర్శిస్తా అని చెప్పడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను కలెక్టర్లను గురుకులాలకు పంపిస్తున్నానన్నారు. ప్రతి కార్యకర్త కెసిఆర్ కేటీఆర్ లు చేసిన కృషిని గ్రామ గ్రామాన గడపగడపకు వివరించాలన్నారు. పోలీస్ కేసులకు భయపడవద్దని తెలిపారు. టిఆర్ఎస్ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. టిఆర్ఎస్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదు.

టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన ఎమ్మెల్యేలు అధికారం పోగానే కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ స్వలాభం కోసం పార్టీకి ద్రోహం  చేశారని ఇలాంటి వారికి రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలన్నారు దీక్షా దివాస్ కి వెళ్లకుండా ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన అధికార పార్టీలను ఎదిరించి బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ రిపేర్ 45 కాళ్లతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి రావడం అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ జాజాల సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేసిన పోరాటాన్ని అభివృద్ధిని పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు వివరించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరమవుతున్న ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదన్నారు. ఈ కార్యక్రమానికి వీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజ్జయిబోదిన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పి చైర్మన్ దాఫెదర్ శోభ రాజు, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ ఎంపీపీలు పిప్పిరి ఆంజనేయులు, దశరథ్ రెడ్డి, బాలమణి, శారద మండల పార్టీ అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి, గండ్ర మధుసూదన్ రావు ,నర్సింలు, ప్రభాకర్ రెడ్డి, కుంభాల రవి యాదవ్, కృష్ణ యాదవ్ యాదవ్, అర్కల ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.