calender_icon.png 30 April, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్నం 2.15కి ఎస్‌ఎస్‌సీ ఫలితాలు

30-04-2025 11:16:24 AM

ఇవాళ పదో తరగతి ఫలితాలు విడుదల

హైదరాాబాద్: ఎప్పుడూ ఎప్పుడూ అని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు(Telangana SSC Results) కాసేపట్లో విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.15కి పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. రవీంద్రభారతి ఆడిటోరియంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పదో తరగతి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విడుదల చేయనున్నారు. ఇది వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ విధానం అమలులో ఉండేది. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఎస్ఎస్సీ బోర్డు(SSC Board) ఇవ్వనుంది. ఫలితాలు https://bse.telangana.gov.in/, https://results.bsetelangana.org/, https://bse.telangana.gov.in ద్వారా తెలుసుకునేందుకు అవకాశముంది. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన పరీక్షలకు 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు సహా మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.