calender_icon.png 18 April, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సౌత్ క్యాంపస్ బంద్

10-04-2025 08:27:40 PM

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్ట్ లకు నిరసన..

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కు మద్దతు తెలిపిన విద్యార్థులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కాంట్రాక్ట్ పద్ధతిలో యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన అధ్యాపకులను గురువారం పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో (సౌత్ క్యాంపస్ నందు) హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నందు విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల గురించి, జీవో నెంబర్ 21తో భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని  తమ సమస్య వివరించడానికి వెళ్లిన కాంట్రాక్ట్ అద్యాపకులను అరెస్టు చేశారు, దీనికి నిరసనగా  తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బంద్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ కు యూనివర్సిటీ విద్యార్థులు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో విశ్వవిద్యాలయాల అధ్యాపకులను  అరెస్టు చేయడం ఈరోజును చీకటి దినముగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి బేసిక్ పే, హెచ్ ఆర్ ప్లస్ డిఎతో పాటు 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాము గత 15 నుండి 20 సంవత్సరాలుగా సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, తమ సర్వస్వాన్ని అంకితం చేసామని  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన రెగ్యులరైజేషన్ లేదా ఉద్యోగ భద్రతతో కూడిన సెవెంత్ పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నారాయణ, హాస్టల్ వార్డెన్స్  డా. యాలాద్రి,  డాక్టర్ సునీత, డాక్టర్ ర మాదేవి, డాక్టర్ నర్సయ్య, అసిస్టెంట్ పి ఆర్ ఓ  డాక్టర్ సరిత, డాక్టర్ నిరంజన్, శ్రీకాంత్, దిలీప్ మరియు పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యాపకులు, డాక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, పోతన్న, శ్రీకాంత్, కనకయ్య, కిషన్, సునీల్ వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.