calender_icon.png 2 April, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి నిలయం తెలంగాణ సాంఘిక గురుకులం

01-04-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 31 (విజయ క్రాంతి,) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాల/కళాశాలు అవినీతి అక్రమాలకు నిలయాలుగా మారాయని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు వెలుగు చూసిన ఉన్నతాధికారుల చర్యలు శూన్యమని విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకల బాలికల పాఠశాల, కళాశాల (భద్రాచలం) పాల్వంచ లో ఉంది. ఆ పాఠశాలలో అనేక అవినీతి కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఏకంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బినామీ పేరుతో శానిటేషన్ కాంట్రాక్టర్ గా పొంది పాఠశాల విద్యార్థులతో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు బహిరంగంగా ముచ్చటించుకుంటున్నారు. ఈ తతంగం కొన్ని సంవత్స రాలుగా బినామీ పేరుతో గురుకులం ప్రిన్సిపాల్ శానిటేషన్ కాంట్రాక్టర్ గా కొనసాగు తున్నట్టు సమాచారం. ఎంత జరుగుతున్న ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై అనేక అనుమానాలు తలెత్తు తున్నాయని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు  హాజరు పట్టికలో లేని ఉద్యోగిని పేరు జీతాల పట్టికలో ఉండటమే పాఠశాల ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపణకు నిదర్శనము.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోప ణలు కూడా ఉన్నాయి. మంచినూనె సరఫరా కాంట్రాక్టర్,  ప్రొవి జన్స్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం వేధిస్తున్నారని తెలుస్తోంది.నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆరు నెలలకు డిడి రద్దు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి ప్రిన్సిపాల్ కు జోనల్ సాయ్ అధికారి అన్నదండలు దండిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారుల స్పందించకపోవడంపై భిన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి .

విద్యార్థులను కొడుతున్న ప్రిన్సిపాల్ 

పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలను  రక్తాలు వచ్చేలా వంటిపై ఎక్కడపడి తే అక్కడ కొడతారని, నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలలతో తిడుతూ విద్యార్థినీలను మానసి కంగా వేధిస్తున్నారని,ఒక్కొక్క రోజు మధ్యాహ్నం భోజనం సాయంత్రం నాలుగు గంట ల వరకు పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని విద్యార్థినేలు ఆరోపిస్తున్నారు. పిల్లలు పాఠశాలలో పడుతున్న ఇబ్బందులను తల్లిదండ్రుల ద్వారా ఉన్నతాధికారులకు సమా చారం ఇచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా ర్థులకు నాణ్య మైన భోజనము, విద్యా ప్రమాణాలు అందించాలని పదే పదే ఆదేశిస్తున్న ఉన్నతాధికారుల పర్యవే క్షణ లోపంతో క్షేత్రస్థాయి లో అందుకు భిన్నంగా విద్యార్థినీలు అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికైనా గురుకులం పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ నిర్వహించాలని, అందుకు బాధ్యులైన వారిని శిక్షించా లని విద్యార్థినీల తల్లిదం డ్రులు డిమాండ్ చేస్తున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప రాణి పై వచ్చిన ఆరోపణలపై ఆమెను వివరణ కోర గా తాను ఎలాంటి బినామీ కాంట్రాక్టర్ గా తీసుకోలేదని, విద్యార్థులను కొట్టడం గాని అసభ్య పద జాలంతో తిట్టడం గాని జరగలేదన్నారు. గత మూడు నెలలుగా కొంతమం ది తమ పాఠశాలలపై అనేక తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.