calender_icon.png 1 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్‌తో విద్యుత్‌ ఒప్పందం.. గొప్ప ముందడుగు: డిప్యూటీ సీఎం భట్టి

29-03-2025 05:24:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ లక్ష్యసాధనలో హిమాచల్ ప్రదేశ్,  తెలంగాణ హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ తో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగు అన్నారు.

శనివారం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు ఆ రాష్ట్ర అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు భద్రతను పెంచుకునే అంశానికి కట్టుబడి ఉందని తెలిపారు.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రతిపాదిత ప్రాజెక్టులు సెలి (400 మెగావాట్లు), మేయర్ (120 మెగావాట్లు)స్వచ్ఛమైన, ఆర్థికంగా మేలైన, విశ్వసనీయమైన విద్యుత్తును పొందడంలో ఉపకరిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు.