calender_icon.png 1 April, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్ ప్రదేశ్‌తో తెలంగాణ ఒప్పందం

29-03-2025 02:05:34 PM

హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ ఒప్పందం

హైదరాబాద్: రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టు(Hydroelectric project)లను నిర్మించడానికి హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. జల విద్యుత్ కోసం హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ ప్రభుaత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం కోసం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka), అధికారులు శిమ్లా చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ తో ఒప్పందం గొప్ప ముందడుగని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ సాధనలో ఈ ఒప్పందం కీలకమని ఆయన వెల్లడించారు. జల విద్యుత్ ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా మేలు జరుగుతోందని భట్టి విక్రమార్క వివరించారు.