- అందుబాటులో అన్ని వనరులు
- సంపదను పెంచేందుకే ఎంఎస్‌ఎంఈ పాలసీ
- ప్రపంచంతో పోటీ పడేలా పీవీ విధానాలు
- పాలసీ రూపకల్పనలో శ్రీధర్‌బాబు కృషి అభినందనీయం
- మనం ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనొచ్చు
- మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
- ఎంఎస్‌ఎంఈ పాలసీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
- ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలే కీలకం: డిప్యూటీ సీఎం భట్టి
- వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు
* ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఎంఎస్‌ఎంఈలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. పారిశ్రామికవేత్తలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలి. వ్యాపార వేత్తలు, పెట్టుబడి దారులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. ఎంఎస్‌ఎంఈలు ప్రధానంగా 6 అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. భూమి, మూలధన లభ్యత, ముడిపదార్థాల అందుబాటు, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక సౌకర్యం లేకపోవడం, మార్కెట్‌లతో అనుసంధానం కాలేకపోవడం వంటి అంశాలు రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్లు.
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి) : పారిశ్రామికవేత్తలకు వడ్డించిన విస్తరిలా తెలంగాణలో అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రమూ అభివృద్ధి సాధించదని, అందుకే ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ని బుధవారం ప్రారంభించింది.
మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎంఎస్‌ఎంఈ పాలసీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించా ల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సంపద ను పెంపొందించాలనే ఎంఎస్‌ఎంఈ పాలసీ ఆవిష్కరించామని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో వ్యవహరించారని, పారిశ్రామిక విధా నంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థి క వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడా రు. ప్రపంచంతో పోటీ పడేలా విధి విధానాలు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.
కొందరిని వ్యాపారం వైపు ప్రోత్సహించాలి
కుటుంబంలోని అందరూ వ్యవసాయంపైనే ఆధారపడటంతో వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడం లేదని తెలిపారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం చేస్తూనే ఇతర కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాల వైపు ప్రోత్సహించాలని కోరారు. అగ్రికల్చర్ అనేది మన కల్చర్ అని, అందుకే వ్యవసాయాన్ని వదలొద్దని రైతాంగానికి విజ్ఞ ప్తి చేశారు. దీంతోపాటు మన కుటుంబ సభ్యులు వ్యాపారాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని, ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫా ర్మా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌కు కొత్త సొబగులు అద్దబోతున్నామని, లండన్ థేమ్స్ నది తరహాలో మూసీని తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు.
సవాళ్లను అధిగమించేందుకే ప్రతిపాదనలు
ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఎంఎస్‌ఎంఈలకు మా ప్రభు త్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు ధీటుగా పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలున్నాయని తెలిపారు. వ్యాపార వేత్తలు, పెట్టుబడి దారులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలు ప్రధానం గా 6 అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని, భూమి, మూలధన లభ్యత, ముడిపదార్థాల అందుబాటు, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక సౌకర్యం లేకపోవడం, మార్కెట్‌లతో అనుసంధానం కాలేకపోవడం వంటి అంశాలు రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్లని స్పష్టం చేశారు. ఈ అడ్డంకులను తొలగించేందుకు 40 ప్రతిపాదనలు చేశామని తెలిపారు.
పారిశ్రామిక పార్కుల్లో వారికి రిజర్వ్ చేస్తాం
రాష్ట్రంలో రానున్న రోజుల్లో నిర్మించే ప్రతి పారిశ్రామిక పార్కులో 20 శాతం ప్లాట్లు ఎంఎస్‌ఎంఈల కోసం రిజర్వు చేయనున్నట్టు రేవంత్‌రెడ్డి వివరించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పా ర్కు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించ బోతున్నట్టు చెప్పారు. 10 పార్కుల్లో 5 ఎంఎస్‌ఎంఈలు ఉంటాయని, వీటిలోని ప్రతి ఎంఎస్‌ఎంఈ పార్కులో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామిక వేత్తలకు, 15 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయనున్నట్టు వివరించారు. అలాగే ఎంఎస్‌ఎంఈలను సమర్థవంతంగా అమలు పరిచి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయను న్నట్టు చెప్పారు.
రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకే: జయేష్ రంజన్, ఐటీ ముఖ్య కార్యదర్శి
గతంలో ఉన్న టీఎస్ ఐపాస్ పాలసీ వల్ల పెద్ద కంపెనీలకే ప్రయోజనం ఉందని, అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈల కోసం పాలసీ ఉండాలని సూచించారు.
శ్రీధర్‌బాబు కృషి అభినందనీయం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయమని సీఎం అన్నారు. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూ నే.. కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. కాం గ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిందని తెలిపారు. మంచి పనులు ఎవ రు చేసినా.. వాటిని కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం వెనక్కు తగ్గదని స్పష్టం చేశా రు. ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడిందని, అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని చెప్పారు. టాటా ఇనిస్టిట్యూట్‌తో కలిసి సంయుక్తంగా ఐటీఐలను రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, ఇందులో రూ.2100 కోట్లు టాటా కంపెనీ సీఎస్‌ఆర్ ఫండ్ కింద సమకూర్చి ఎంతో సహకరించిందన్నారు.
వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్‌ఎంఈల పాలసీని విడుదల చేశాం. పారిశ్రామిక రంగంలోని ప్రతిఒక్కరూ తెలంగాణ వైపే చూస్తున్నారు. రాబోయే కాలంలో ఎంఎస్‌ఎంఈల్లో సాంకేతికతను వాడుకోవాలి. ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్‌ఎంఈలు. ఈ పరి శ్రమలకు చెందిన 120 మంది ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు తీసుకు న్నాం. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా లు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ విధానం.
మన రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారు. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక వసతులతో ప్లాట్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేస్తాం. కొత్తగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం నుం చి ఆర్థిక సాయం పొందేందుకు సాంప్రదాయ, ప్రత్యామ్నాయ మార్గాలు చూశాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక పురోభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. సమ్మిళిత అభివృ ద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.
పారిశ్రామికాభివృద్ధితోనే భూములకు విలువ
చదువుల్లో నాణ్యత ఉండటం లేదని, ప్రతి ఏటా లక్ష మంది ఇంజినీర్లు బయటి కి వస్తున్నా.. వాళ్లలో సాంకేతిక పరిజ్ఞానం ఉండటం లేదని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి అధ్యయనం తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యు వతకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తల నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసిందన్నా రు. రాష్ట్రంలో భూముల విలువ గణ నీయంగా పెరిగిందని, ఇక్కడ ఎకరం భూమి అమ్మితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందెకరాలు కొనవచ్చని అన్నారు. ఇదం తా విద్య, ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమవుతుందని చెప్పారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించామని వెల్లడించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం
మూసీ అంటే మురికి కూపం కాద ని, మూసీని మ్యాన్ మేడ్ వండర్‌గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. మా ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా గడీల మధ్య లేదని, ప్రజల కోసమే పనిచేసే ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా ప్రభు త్వ కార్యాలయాల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. అందరి సలహా లు, సూచనలు స్వీకరించడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. కోటి మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వర్లును చేసేందుకు ప్రయత్ని స్తున్నామని తెలిపారు.
దీని కోసం లక్ష కోట్ల రూపాయలను జీరో వడ్డీకే మహిళలకు ఇప్పించేందుకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నదని పేర్కొన్నారు. దీంతోపాటు శిల్పారామం దగ్గర మూడెకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలల నిర్వహణను మహిళల చేతు ల్లో పెట్టామని, మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టే పని బాధ్యత లు అప్పజెప్పినట్టు తెలిపారు. యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75కు పెంచి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు.
ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలే కీలకం: డిప్యూటీ సీఎం
రాహుల్ గాంధీ ఆలోచనలతోనే ఎం ఎస్‌ఎంఈ నూతన పాలసీ తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. ఇక్కడ ఇతర రాష్ట్రాలకు విభి న్నంగా రూపొందించారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ రూపొందించిన మంత్రి శ్రీధర్‌బాబుకు ధన్యవాదాలు. ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం ఎంఎస్‌ఎంఈలు కీలకం. దేశ జీడీపీకి, రాష్ట్ర జీడీపీకి ఎంఎస్‌ఎంఈ ఎంతో తోడ్పడుతుంది. దాదాపు రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఎన్‌సీలు ముందుకు వచ్చాయి. భారీ పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈల నుంచి పలు ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి.