calender_icon.png 21 January, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ‘టీ స్కేర్’

13-07-2024 01:45:08 AM

  • రాయదుర్గంలో భారీ ప్లాజా

టీజీఐఐసీ ఆధ్వర్యంలో టెండర్లకు ఆహ్వానం

హైదరాబాద్, జులై 12(విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్కేర్ తరహాలో తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన ఇండస్ట్రీ ఐకాన్‌ను  నిర్మించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. టైమ్స్ స్కేర్  మాదిరిగా ‘టీ స్కేర్’ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఇండస్ట్రీస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీ స్కేర్‌ను వ్యూహా త్మంగా రాయదుర్గంలో నిర్మించనుంది. రాయదుర్గం సమీపంలోని హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా కంపెనీలు ఉన్నాయి.

అందుకే ఈ ప్రాంతంలోనే ‘టీ స్కేర్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బిడ్ వేయడానికి ఆగస్టు 9 చివరి తేదీ అని టీజీఐఐసీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వ్యాపారంతో ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో ప్రభుత్వం ‘టీ స్కేర్’ నిర్మాణానికి పూనుకుంది. కంపెనీలు తమ సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ‘టీ స్కేర్’లో ప్రత్యేక సౌకర్యాలను కల్పించనున్నారు. నగర ప్రజలు సేదతీరేందుకు, వారాంతంలో ఆహ్లాదాన్ని పొందేందుకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. అలాగే వ్యాపార ప్ర కటనల కోసం బిల్ బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. బిల్ బోర్డు వెలుగుల్లో నాలెడ్జ్  సిటీ మరింత కాంతిని సంతరించుకోనుంది.