calender_icon.png 18 November, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు ప్రజలందరూ సహకరించాలి

09-11-2024 08:51:02 PM

మునగాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎన్యుమరేటర్లల సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో శిరీష మాట్లాడుతూ... మండలంలోని అన్ని గ్రామాలలో మొత్తం 86 న్యూమరేషన్ బ్లాక్ లలో 110 మంది ఎన్యుమరేటర్లను నియమించడం జరిగింది. వీరందరికీ మరో మారు జిల్లా మాస్టర్ ట్రైనర్ రమేష్ చే శిక్షణ నిర్వహించినారు. అందరికీ మెటీరియల్ అందజేసినారూ ఇట్టి సర్వేను నవంబర్ 9 నుండి 18 వరకు ప్రతి ఇంటిని సర్వే జరిపి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. అందుకుగాను తాసిల్దార్ కార్యాలయం,  ఎంపీడీవో కార్యాలయంలో డాటా నమోదు నిర్వహించారు. 

కొత్త వాటర్ల నమోదు కొరకు ప్రతి పోలింగ్ స్టేషన్ లలో  బియల్ ఓలు స్పెషల్ క్యాంపైన్ డే గలదు. ఈ కార్యక్రమంను తహసీల్దార్ వి.ఆంజనేయులు ఆకస్మికంగా పరిశీలించినారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన వారిని యువతి, యువకులను ఓటు నమోదు చేయించుటకు ప్రోత్సహించాలని ఆదేశించినారు. ప్రజలందరూ సర్వే చేయు సిబ్బందికి సహకరించాలని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.