calender_icon.png 30 December, 2024 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర చాలా కీలకం

15-10-2024 03:35:07 PM

వికారాబాద్,(విజయక్రాంతి): దామగుడం నేవీ రాడార్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వీఎల్ఎఫ్ నమూనాను రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి పరిశీలించారు.  వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కలాం జయంతి రోజు ఈ కార్యక్రమం తలపెట్టడం సంతోషంగా ఉందని, అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్ కు గొప్ప పేరుందని, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర చాలా కీలకం అని కేంద్రం రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో కమ్యూనికేషన్ పాత్ర ఎనలేనిదన్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం... సమాచారం క్షణాల్లో చేరుతోంది.. సమాచారం విప్లవం.. ఇవాళ అనేక దేశాలను దగ్గర చేస్తోందని, ఓడలు, సబ్ మెరైన్లకు సమాచారం ఇవ్వడంతో వీఎల్ఎఫ్ ప్రముఖపాత్ర పోషిస్తాయని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు.