calender_icon.png 18 November, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ మోడల్ గుజరాత్‌కు కౌంటర్

18-11-2024 01:57:48 AM

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఆగదు

  1. సబర్మతి నది ప్రక్షాళనకు కిషన్ రెడ్డి చప్పట్లు కొట్టలేదా? 
  2. అప్పుడు 50వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం తరలించలేదా?
  3. మహారాష్ట్ర నుంచి 17 ఫ్యాక్టరీలను గుజరాత్‌కు తరలించారు 
  4. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): దేశంలో గుజరాత్ మోడల్ ఫెయిలైందని, భవిష్యత్ అంతా తెలంగాణదే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ మోడల్ అని అది గుజరాత్‌కు కౌంటర్‌గా మారుతుందని అన్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ పరివారం కిషన్‌రెడ్డిని వాడుకుంటోందని విమర్శించారు.

రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న బీజేపీ వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. నయాగామ్, నాందేడ్, భోకర్‌లో ఆయన ప్రచారం సాగింది. సోలాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు.

దేశంలో కాంగ్రెస్ మోడల్‌ను అమలు చేస్తామన్నారు. గుజరాత్ మోడల్‌ను దేశం అంగీకరించబోదని స్పష్టం చేశారు. బీజేపీ సమాజాన్ని విభజించి రాజకీయాలు చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అధికారంలో హి లేనప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు.

గుజరాత్ నాయకులు మహారాష్ట్ర నుంచి ౧౭ ఫ్యాక్టరీలను తరలించుకుపోయారని తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ల గురించి చర్చిస్తుందని, తెలంగాణలో 4 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ వల్ల.. ఇటీవల 11,000 మంది ఉపాధ్యాయ నియామకాలు జరిగితే.. 720 మంది ముస్లిం అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు.

అబద్ధాల పోటీలు పెడితే దేశంలో ప్రధాని మోదీ నంబర్ వన్‌గా నిలుస్తారని సీఎం చెప్పారు. మహా నాయకులు పుట్టిన నేల మీద ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని, గుజరాత్ గులాంలుగా మారారని విమర్శించారు. తెలంగాణలో తమ సర్కారు 50 రోజుల్లోనే రుణమాఫీ చేసిందని, మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే రూ.3 లక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

గుజరాత్‌కు గులాంగా కిషన్‌రెడ్డి

సబర్మతి ప్రక్షాళనను అభినందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ముసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వ్యతిరేకించడంపై సీఎం ఫైర్ అయ్యారు. సబర్మతి ప్రక్షాళన సమయంలో 50వేల మందిని గుజరాత్ ప్రభుత్వం తరలించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టారని నిలదీశారు. కిషన్‌రెడ్డి కూడా గుజరాత్‌కు గులాంగా మారారన్నారు. మహారాష్ట్రకు షిండే, అజిత్ పవార్లు ఎలా విరోధులుగా మారారో.. కిషన్‌రెడ్డి కూడా తెలంగాణకు అలాగే మారినట్లు చెప్పారు.