calender_icon.png 28 February, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ ఆగేదేలే.. ఎవరూ ఆపలేరు!

28-02-2025 02:04:09 AM

  1.  ఏడాది కాలంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు
  2. ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్ చేశాం
  3. హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  
  4. హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్‌తో 5వేల కొత్త ఉద్యోగాలు
  5.  రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

* తెలంగాణను ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ర్టంగా మారుస్తానని అన్నప్పుడు అది సాధ్యంకాదని కొందరు అన్నారు. రెండుసార్లు దావోస్ పర్యటనలో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత అందరూ నమ్మడం మొదలు పెట్టారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మొదట తెలంగాణ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరు నమ్మలేదని, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇది నిజమేనని అంగీకరిస్తోందని చెప్పారు. గురువారం మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ రాష్ర్టం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు వివరించారు. ఏడాది కాలంలోనే తెలంగాణ కు దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చిన విషయాన్ని చెప్పడానికి తాను గర్విస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచిన ట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉన్నా రన్నారు.

ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నట్లు చెప్పారు. ప్రతిరోజూ తాము బహుళజాతి సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో, గత సంవత్సరం సంతకం చేసిన ఎంఓయూల కొత్త కార్యాలయాలను ప్రారంభించడమో జరుగు తుందన్నారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ర్టంగా మారుస్తానని అన్నప్పుడు అది సాధ్యంకాదని కొందరు అన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

రెండుసార్లు దావోస్ పర్యటనలో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత అందరూ నమ్మడం మొదలు పెట్టారన్నారు. మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నుతై కాద ని, ప్రపంచంతోనే పోటీ అని సీఎం మరోసారి స్పష్టం చేశారు.

హెచ్‌సీఎల్ టెక్ దేశానికే గర్వకారణం

ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను ఇప్పటికే నంబర్‌వన్‌గా చేశామని, రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సెన్సైస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా కూడా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పే ర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక హైదరాబాద్ రైజింగ్ ఆగదని ప్రజలే అంటున్నట్లు చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సెన్సైస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నామని వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియా సదస్సును నిర్వహించామని, ఇవాళ హెచ్‌సీ ఎల్‌లో ఉన్నామన్నారు. గ్లోబల్ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచినట్లు వివరించారు.

2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా హెచ్‌సీఎల్ పెద్దస్థాయికి ఎదిగిం దని, ఇవాళ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5వేల మందితో ప్రపంచ స్థాయి సదుపాయంతో సేవలు అం దిస్తున్న ట్లు వివరించారు. ఇది 60 దేశాలలో ఆపరేట్ చేస్తోందని, 2.2 లక్షల మం దికి పైగా ఉద్యోగులున్నారని చెప్పారు. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫర్స్ క్రియేట్ చేస్తున్నట్లు వివరించారు. 

హైదరాబాద్ నుంచి 15 పేటెంట్స్

స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణను  ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలన్నది తమ లక్ష్యమని మరోసారి మంత్రి గుర్తు చేశారు. ఇది అంత తేలికైన విషయం కాదని, కానీ, మేం చిత్తశుద్ధితో కృషిచేసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.

ఈ లక్ష్యసాధనలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించాలని కోరుతున్నానని, ఐటీ పరిశ్రమలు సాంప్రదాయబద్ధంగా కా కుండా ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేలా కొత్త గా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. జీసీసీలను గ్లోబల్ వాల్యూ సెంటర్లు మార్చుతామని వీటిల్లో తెలంగాణ యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు దక్కించుకునేలా తీర్చిదిద్దుతామని మరోసారి చెప్పారు. హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు హబ్ గా మారిందని, ఇటీవలి కాలంలో ఇక్కడి నుంచి 15 పేటెంట్స్ రావడం సంతోషకరమన్నారు.

యావత్తు ప్రపంచం టెక్నాలజీ అంటేనే హైదరాబాద్ వైపు చూసేలా చేస్తామని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణం. ఈ నూతన క్యాంపస్ ద్వారా కొత్తగా 5వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, హెచ్‌సీఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగం వృద్ధి

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, ఇందుకు 1992లోనే పునాది పడిందని, అప్పట్లో ఏర్పాటు చేసిన సాప్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఐటీ రంగం అభివృద్ధికి మార్గ నిర్దేశనం చేసినట్లు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో హైదరాబాద్‌ను ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో తెలంగాణను హబ్‌గా మారుస్తామని మంత్రి చెప్పారు.

ఈ టెక్నాలజీస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ర్ట ప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహకరిస్తామని తెలిపారు. త్వరలోనే క్వాంటం కంప్యూ టింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌ను ప్రారంభించబోతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే స్విట్జర్లాండ్‌కి చెందిన దిగ్గజ సంస్థ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని మంత్రి వెల్లడించారు. అన్నిరంగాల్లో నైపుణ్య మాన వ వనరుల కోసం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేయడమే తమ లక్ష్య మన్నారు.

ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూని వర్సిటీకి రూపకల్పన చేశామని, ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులను ఈ యూ నివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం చేశామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణం గా కోర్సులను రూపొందిస్తూ, పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌ను అందిస్తున్నట్లు వివరించారు.