calender_icon.png 6 October, 2024 | 3:24 PM

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు

06-10-2024 01:27:18 PM

హైదరాబాద్: తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు దేశానికే ఆదర్శంగా ఉంటాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు సరిగా లేవని భట్టి విక్రమార్క ఆరోపించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 600కు పైగా రెసిడెన్షియల్ సూళ్లకు సొంత భవనాలు లేవని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ. 5 వేలు కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కేవలం విద్యకే కాకుండా.. క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లు కట్టాలని నిర్ణయించాం.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఈ నెల 11న శంకుస్థాపన చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో  మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.