హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు(Telangana Republic Day celebrations) ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, 25 లక్షల మందికి పైగా రైతుల రుణాలను మాఫీ చేసి వారికి భరోసా కల్పిస్తున్నామని, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పిస్తామని.. మేము 2024 వర్షాకాలంలో 1.59 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేసాము. 4,500 కోట్లను ఆదా చేశాం అందెశ్రీ(Ande Sri) రచించిన జయ జయహే పాటను రాష్ట్ర గీతంగా మారుస్తామని గవర్నర్ వెల్లడించారు.