calender_icon.png 31 December, 2024 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులో మాదక ద్రవ్యాల గుట్టు రట్టు

29-12-2024 11:04:22 AM

హైదరాబాద్: తెలంగాణ పోలీసులు(Telangana State Police) ఆదివారం ఉదయం కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ (Bhubaneswar-Hyderabad) వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును అడ్డగించి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలపై ల్యాబొరేటరీ పరీక్షలకు పంపినట్లు పోలీసులు(Police) తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.