23-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22(విజయక్రాంతి): దేశంలో తెలంగాణ పోలీస్‌కు మం చి పేరుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ అవసరాలను తీర్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
శనివారం సచివాలయంలో హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్దఎత్తున హైదరాబాద్‌కు వలసలు పెరుగుతున్నాయని ఈ మేరకు భద్రత విషయంలో హోంశాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా, డీజీ అభిలాష్ బిస్త్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పాల్గొన్నారు.