15-04-2025 12:23:15 AM
అక్రమంగా దేశీదారు తరలిస్తున్న నలుగురి అరెస్ట్
భీంపూర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ అఖిల్ మహహన్ ఆదేశాలతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా రు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు తీసుకొచ్చి అమ్ముతున్న నలుగురు వ్యక్తుల ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు జైనథ్ సీఐ సాయినాథ్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
భీంపూర్ మండలం అర్లి(టి) మందపల్లి గ్రామంలో దేశీదారు అమ్ముతున్నరన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏఎస్‌ఐ సిరాజ్, ముంతాజ్, కానిస్టేబుల్స్ మధుకర్, రవీందర్‌తో కలిసి దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాండ్వీ నుంచి అక్రమంగా దేశీదారు తీసుకువస్తున్న ఆత్రం లక్ష్మణ్, ఆశి ష్ జైస్వాల్, కుంబెకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణ లను అదుపులో తీసుకొనట్లు సీఐ వెల్లడించారు.
వారి వద్ద 196 దేశీదారు బాటిల్లను సీజ్ చేయడం జరిగిందని, పట్టుకున్న వారిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాగా, జిల్లాలో ఎక్కడ దేశీదారు, పేకాట, మట్కా, గుట్కా, గంజా యి వంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామ న్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూనట్లు సీఐ తెలిపారు.