calender_icon.png 22 October, 2024 | 8:21 PM

తెలంగాణలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్

22-10-2024 05:31:57 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బీజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన ధ్వజమెత్తారు. ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్ చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేఛ్చనివ్వాలని, రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని కేటఆర్ సూచించారు.