ఐఎస్వో సర్టిఫికెట్ ప్రదానం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి పోలీస్ అకాడమీకి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ శిక్షణకేంద్రంగా ప్రతిష్ఠాత్మక ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది. ఈ సర్టిఫికేట్ను గురువారం జరిగిన కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో డీజీపీ డాక్టర్ జితేందర్, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్లకు ఐఎస్ఓ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ అకాడమీకి ఐఎస్ఓ అవార్డు రావడంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్తో పాటు అధికారుల కృషి అభినందనీయమన్నారు. అభిలాష బిస్త్ మాట్లాడుతూ.. 5 క్వాలిటీ రేటింగ్ సంపాదించిన భారతదేశంలో మొదటి అకాడమీగా అవతరించడం ద్వారా తెలంగాణ పోలీసు అకాడమీ సగర్వంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందన్నారు.