06-02-2025 07:24:36 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఉన్నత విద్యా మండలి పీఈసెట్(PECET), ఎడ్‌సెట్ (EDCET) ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న జారీ చేయబడుతుందని, మార్చి 15 నుండి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తులను మే 30 వరకు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి తెలిపిది. జూన్ 11 నుండి 14వ తేదీ వరకు పరీక్ష జరుగనున్నాయి.
ఎడ్ సెట్ షెడ్యూల్..
కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఎడ్‌సెట్(EDCET) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎడ్‌సెట్ నోటిఫికేషన్ మార్చి 10న జారీ చేయబడుతుందని, దరఖాస్తులు ప్రక్రియ మార్చి 12 నుండి మే 13వ తేదీ వరకు స్వీకరించబడుతుందని వర్సీటీ ప్రకటనలో పేర్కొంది. పరీక్షలు జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో నిర్వహించబడతాయి.