calender_icon.png 25 December, 2024 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు ఎక్కువ ఇండ్లు కావాలి

19-10-2024 01:24:53 AM

 గృహ నిర్మాణ సంయుక్త కార్యదర్శితో మంత్రి పొంగులేటి

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అందుకే తెలంగాణకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుంచి అత్యధికంగా ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

శుక్రవారం  సచివాలయంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి కుల్‌దీప్ నారాయణ్ మంత్రి పొంగులేటితో భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా అధికారంలో ఉన్న సర్కార్ పేదలకు ఇండ్లు నిర్మించే విషయంలో తీవ్ర అలసత్వం వహించిందన్నారు.

ఇండ్లు లేని పేదలందరికీ తమ ప్రభుత్వం పక్కాఇండ్లు కట్టించే లక్ష్యంతో ముందుకెళ్తుందని తెలిపారు. కాబట్టి తెలంగాణ ప్రాధాన్యాన్ని గుర్తించి ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ పాల్గొన్నారు.