హైదరాబాద్: నేడు పంట రుణమాఫీ కార్యక్రమం కొనసాగనుంది. జల్లాల్లో రుణమాఫీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనున్నారు. నల్గొండ పంట రుణమాఫీ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనున్నారు. సంగారెడ్డి ఆందోల్ మండలం దాకూర్ లో మంత్రి రాజనర్సింహ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బొల్లికుంట రైతు వేదికలో మంత్రి కొండా సురేఖ పాల్గొనున్నారు.
రైతన్నలకు వరంగల్ వేదికగా మాట ఇచ్చాం.... మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. గురువారం నాడు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ, తొలి రోజు 11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ ఇప్పటికే 7 వేల కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని వెల్లడించింది. ఇచ్చిన మాట మేరకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ నేటి నుంచే అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.